Officials Planning To Replace 19th Gate At Tungabhadra Dam : గల్లంతైన తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) 19 గేటు ప్లేస్‌లో కొత్త గేటు ఏర్పాటుకు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పోయిన గేట్ స్థానంలో స్టాప్ లాగ్ (Stop Log) ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోస్పేట్ ఇండస్ట్రీ ఏరియా (Hospet Industry Area) లో గేటు తయారు చేయిస్తున్నారు. గేటు సైజు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు , 50 టన్నుల బరువు ఉంది.
పోయిన గేటు స్థానంలో కొత్త గేటును ఈ నెల 16 లోపు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రస్టు గేట్ల దిగువకు నీరు తగ్గించకుండా.. అంతకన్నా ముందే స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ప్రహవం ఉండడంతో నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో డ్యామ్‌లో 19వ గేటు ఎత్తుతుండగా చైన్‌లింక్ తెగింది. డ్యామ్‌లో ప్రస్తుతం నీటి నిల్వ 97 TMCలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గేటు తెగడంతో వృధాగా 8 టీఎంసీల నీళ్లు పోయినట్లు పేర్కొన్నారు.
Also Read : జూలైలో ధరలు తగ్గాయట.. ఐదేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం!