TSRTC Bus Driver Committed Suicide: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు కిందపడి ఆర్టీసీ డ్రైవర్ నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింహులుపై ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాద ఘటనలో సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. తాజాగా ఈనెల 9న సర్వీస్ నుంచి ఆర్టీసీ అధికారులు తొలిగించారు. సర్వీస్ నుంచి తొలగించారనే మనస్తాపంతో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్ నర్సింహులు స్వగ్రామం జహీరాబాద్ మండలం ఖాసీంపూర్గా పోలీస్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.