Vande Sadharan Express: ప్రయాణికులకు భారతీయ రైల్వే అధికారులు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’ ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ముంబై నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్ చేరుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Watch | Soon-to-be-launched Vande Sadharan Express, a non-AC alternative to Vande Bharat trains, spotted at Vadodara Junction; video goes viral pic.twitter.com/6N5J1DY1cJ
— DeshGujarat (@DeshGujarat) November 6, 2023
ఈ మేరకు మొత్తం 22 కోచ్‌లతో కూడిన ఈ ట్రయల్ రన్‌కు సంబంధించిన ట్రైన్ వీడియో సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లు నడుస్తుండగా అదే తరహాలో ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’లను రూపొందించారు. ఇవి పూర్తిగా నాన్ ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. ఈ కొత్త రైళ్లలో స్లీపర్, జనరల్ క్లాసులున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వీటిలో సీసీటీవీ కెమెరాలు అమర్చామని, ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందే సాధారణ్ రైళ్లకు రెండు చివరల ఇంజిన్లు ఉండగా.. సిగ్నలింగ్, ట్రాక్‌ల వీలును బట్టి వాటిని వినియోగిస్తారట. సుమారు 1800 మంది ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చని చెప్పారు.
Also read : రైలులో భయానక ఘటన.. శవంతో 600 కిలోమీటర్ల ప్రయాణం
ఇక గరిష్ఠ వేగం 130 కిలోమీటర్లు కావడంతో 500 కిలోమీటర్లకు పైగా ఉండే మార్గాల్లో ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు. దేశంలోని పలు ప్రముఖ నగరాల గుండా ఈ వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనుండగా ముంబై-న్యూఢిల్లీ, పట్నా-న్యూఢీల్లీ, హావ్ డా-న్యూఢిల్లీ, హైదరాబాద్-న్యూఢిల్లీ, ఎర్నాకులం-గువాహటి మార్గాల్లో వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాఉ దశలవారీగా ఈ సర్వీసులను పెంచేందుకు రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.