ఆంధ్రులు అభివృద్ధి చేశారు
విజయవాడ సెంట్రల్లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ ఉద్యమ కార్యోన్ముఖులు ఐక్యత వర్ధిల్లాలని ఆంధ్ర ప్రదేశ్ ‘జై ఆంధ్ర ఉద్యమ వేదిక’ను మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకని వెంకటరత్నం మనవడు రామ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఆంధ్రులకు అన్నింటా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఆనాటి మద్రాస్ నుంచి కర్నూలు, ఆ తర్వాత హైదరాబాద్‌ను మన రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్‌గా ప్రకటించి మన శ్రమను, మేథస్సును పెట్టుబడిగా పెట్టించారని అన్నారు. హైదరాబాద్‌ను మహానగరంగాను, విశ్వనగరంగాను మన ఆంధ్రులు అభివృద్ధి పరిచారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అణుగుణంగా ఏర్పడిన రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్‌గా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా విభజించిందన్నారు. మన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా ఆంధ్ర ప్రదేశ్‌కు రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా- విభజన చట్టంలో గల హామీలను 10 ఏళ్ళు కల్పిస్తామన్నారు.
అభివృద్ధికి నోచుకోలేదు
ఆర్థిక లోటును భర్తీ చేస్తామన్నారు. అన్నింటా అండగా నిలుస్తాం అని ఆంధ్రులను పచ్చిగా నమ్మించి నేడు ద్రోహం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కక్ష గట్టి మన రాష్ట్రంలో గల అపార ఖనిజ సంపదను వారి రాజకీయ అవసరాలకు దోచుకుపోతున్నారని మండి పడ్డారు. అశాస్త్రీయంగా విభజన జరిపి 9 ఏళ్లు అయినప్పటికి ఏపీ ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోకపోగా వున్నటువంటి అభివృద్ధి సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగు పాలనలో ఆనాడు స్వరాష్ట్రంలో ఆంధ్రులకు స్వేచ్ఛలేదు, హక్కులు లేవు అన్నారు. ఉవ్వెత్తున లేచిన జై ఆంధ్ర ఉద్యమం ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిందన్నారు. ఆంధ్రుల డిమాండ్‌ను పరిష్కరిస్తాం, రాష్ట్రాన్ని విభజించటం సాధ్యం కాదని ఆనాడు కూడా ఆంధ్రులను నమ్మించి ఉద్యమాన్ని నీరుగార్చారు.
ఆత్మ బలిదాన త్యాగాలకు అమరులైయ్యారు
ఆనాడు ఆంధ్రుల ఉద్యమస్ఫూర్తి భారత చరిత్రలోనే మరుపురాని ఉద్యమంగా చరిత్ర అంశాల్లో నిలిచింది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్రులు అందరూ రోడ్లపైకి వచ్చి జై ఆంధ్ర అంటు తుపాకి తూటాలకు ఎదురు నిలిచి ఆంధ్రుల ధైర్యాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. సుమారు 450 మంది పైబడిన ఆంధ్రులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కోసం స్వచ్ఛందంగా కేంద్ర బలగాల తూటాలకు ఎదురు నిలిచి ఆత్మ బలిదాన త్యాగాలకు అమరులైయ్యారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్ని జిల్లాల అభివృద్ధి. ఒరిజనల్ డీపీఆర్ నమూనా 45.72 మీటర్స్ ఎత్తుతో పోలవరం జాతీయ ప్రాజెక్టు సాధన. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగింపు. పోర్టుల ప్రైవేట్ పరంలో రాష్ట్ర అభివృద్ధి సాధనకై 30% వాటాను సాధించటం. ఆయిల్, గ్యాస్ నిక్షేపాల్లో 50% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధుల సాధన. ఇసుక, గనులు త్రవ్వకాల్లో పర్యావరణ రక్షణకు ప్రాధాన్యత కల్పించటం వంటి అజెండా కావాలన్నారు.