Vijay Antony’s Toofan Movie : కోలీవుడ్ హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. రిలీజైన వారానికే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (ఆగస్టు 15) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఇప్పుడు కేవలం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చింది. మరో వారం తర్వాత తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా తమిళంలో ఈ మూవీ ‘మజై పిడిక్కాథ మణితాన్’ అనే పేరుతో రిలీజ్ అయింది.
Also Read : ‘దేవర’ నుంచి ‘భైర’ గ్లింప్స్ వచ్చేసింది.. విలన్ గా భయపెట్టిన సైఫ్..!
అక్కడ సినిమాను ఆగస్టు 2 న విడుదల చేస్తే.. తెలుగులో మాత్రం వారం తర్వాత రిలీజ్ చేశారు. ఇక సినిమా ఇంత త్వరగా ఓటీటీలోకి అందుబాటులోకి రావడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్, శరత్ కుమార్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.