Toll Pay With GPS : ఒక ఊరు వెళ్ళాలన్నా… ఇంకో ఊరు దాటాలన్నీ టోల్ కటటాల్సిందే. ప్రతీ ముఖ్యమైన ప్రదేవాలకు ఎంటర్ అయే ముందు టోల్ ప్లాజా(Toll Plaza) లు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు టోల్ ప్లాజాలో ఆగా డబ్బులు కట్టి వెళ్ళాల్సి వచ్చేది. దాన్ని సరళతరం చేస్తూ ఫాస్ట్ ట్యాగ్(Fast Tag) లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాన్ని మరింత ఈజే చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మనం కట్టాల్సిన టోల్స్ ను మన జీపీఎస్(GPS) తో అనుసంధానం చేస్తోంది. దీని వల్ల మనం ఎక్కడా ఆగకుండానే ఆటోమాటిక్ గా టోల్ చెల్లించేయొచ్చు. దీని వలన వాహనదారులకు బోలెడంత సమయం ఆదా అవ్వడమే కాకుండా..ట్రాఫిక్ కష్టాల నుంచి కూడా తప్పికుంచుకునే అవకాశం లబిస్తుందని చెబుతోంది.
Also Read:రిపబ్లిక్ డే పరేడ్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో వచ్చే ఏడాది మార్చికల్లా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్, టెక్నాలజీలను అమలు చేస్తామని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆటోమాటిక్ టోల్ వసూలు కోసం నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్‌తో కూడిన రెండు ప్రాజెక్టులను ఇప్పటికే ప్రభుత్వం నిర్వహించిందని…ఇవది రెండూ సక్సెస్ అయ్యాయని తెలిపారు.
ఇప్పుడు వచ్చే అన్ని కార్లకు జీపీఎస్ ఉంటోంది. ఒకవేళ అలా కార్లు ఏమైనా ఉంటే వాటిని ఎన్పీఆర్ కెమెరాల ద్వారా గుర్తించి వాటి లోట్ ను నిర్ణయిస్తారు. జీపీఎస్ ఉన్న వాహనాలకు అయితే అదే ఆటోమాటిక్ గా వాహనాల స్థానాన్ని నిర్ణయించి టోల్స్ ను పేచేసేస్తుంది. దీనికి వాహనాలను ఎక్కడా ఆపక్కర్లేదు. కనీసం వేగాన్ని కూడా తగ్గించక్కర్లేదు అని చెబుతోంది ప్రభుత్వం.