Title Song Poster : ‘ఒసేయ్ అరుంధతి'(Osey Arundhati) సినిమా టైటిల్ సాంగ్ ఇప్పటికే వింక్ మ్యూజిక్, జియో సావన్(JioSaavn) తదితర ప్లాట్ ఫారాల్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం ఒసేయ్ అరుంధతి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను బుధవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. లిరికల్ వీడియోకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ఎంతో క్యాచీగా ఉండే ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్..
వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రాన్ని గూడూరు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి(Guduru Pranay Reddy) మాట్లాడుతూ.. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Abhinav: అత్యాసలేని ‘మై డియర్ దొంగ’.. అందరికీ కనెక్ట్ అవుతుందట!
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం..
చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్(Vikrant Kumar) మాట్లాడుతూ.. హైదరాబాద్(Hyderabad) లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలు అరుంధతి.. తన పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పారు.