Neha Shetty About Her Role In Tillu 3 : స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ‘DJ టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో పార్ట్-1 లో ఫిమేల్ లీడ్ రాధికా రోల్ లో నటించిన నేహా శెట్టి గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. మూవీ సెకెండాఫ్ లో ఆమె ఎంట్రీకి థియేటర్స్ అంతా దద్దరిల్లిపోయాయి.
ఇక త్వరలోనే ‘టిల్లు పార్ట్-3’ కూడా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. మరి పార్ట్ -3 లోనూ రాధిక పాత్ర కంటిన్యూ అవుతుందా? లేదా? అనే సందేహంలో ఫ్యాన్స్ ఉండగా.. ఇదే విషయమై నేహా శెట్టి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
Also Read : ‘పుష్ప 2’ కపుల్ సాంగ్.. ట్రెండింగ్ లోకి మరో కొత్త ఐకానిక్ స్టెప్.. మీరూ ట్రై చేయండి!
‘టిల్లు 3’ లో రాధికా తిరిగొస్తుందా?
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహా శెట్టి టిల్లు 3 లో తన పాత్ర పై క్లారిటీ ఇచ్చింది. ” మేకర్స్ రాధిక పాత్రను ఇంకా చూపించాలనుకుంటే కంటిన్యూ చేస్తారు. దర్శకులు నాకు ఇచ్చిన డైలాగ్స్ ని ఎంత అందంగా చెప్పాలనేదాని గురించే నేను ఆలోచిస్తాను. సీన్స్ తర్వాత ఏం జరుగుతుందనేది ముందుగా తెలుసుకోను.
‘టిల్లు స్క్వేర్’ లో రాధిక బెంగళూర్ వెళ్లినట్లు చూపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత వేరే పెళ్లి చేసుకుంటుందా? లేదంటే టిల్లు కోసం తిరిగి వచ్చేస్తుందా? అనేది చెప్పలేం” అంటూ తెలిపింది. నేహా శెట్టి కామెంట్స్ ని బట్టి చుస్తే టిల్లు 3 లోనూ ఆమె పాత్రను మేకర్స్ కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.