Three Feared Drowned In AP : మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్ (Cyclone Michaung)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడంతోపాటు తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే ఈ తుపాన్ కారణంగా తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖ తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహాదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరీ సీతారామరాజు జిల్లాలో వాగు దాటుతున్న ముగ్గురు స్థానికులు గల్లంతు అయ్యారు.
వాగుదాటబోయి ముగ్గులు గల్లంతు.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ కి చెందిన ముగ్గురు వాగులో పడి కొట్టుకుపోయారు.
వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వీరిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొట్టుకుపోయిన వారి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.#ALLURI #APNews… pic.twitter.com/oWxA6xwUgE— RTV (@RTVnewsnetwork) December 7, 2023
ఇది కూడా చదవండి : తెలంగాణలో పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు?
ఈ మేరకు అల్లూరి జిల్లా (Alluri District)అనంతగిరి మండలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుపాను ప్రభావంతో భారీగా వర్షం కురుస్తోంది. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అరకులోయ – విశాఖ ఘాట్ రోడ్లో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో జనజీవనం స్తంభించింది. అనంతగిరి మండలంలోని భీంపోలు పంచాయతీలో ఓ మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు వాగు దాటుతుండగా నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. ఈ ముగ్గురు గిరిజనులు సీతపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి కుమార్ (25), మిరియాల కమల (40), గెమ్మెల లక్ష్మి (50)గా గుర్తించారు. గాలింపు చర్యలకోసం ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపగా.. పిఓ అభిషేక్ స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురులో కాశీపట్నం వద్ద కుమార్ మృతదేహం లభించింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.