This Week Movies: ప్రతి నెలలో మొదటి వారం వచ్చిందంటే సినిమాల సందడి మొదలవుతుంది. ఈ వారం కూడా థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిన్న, పెద్ద సినిమాలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కాబోయే చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
’35-చిన్న కథ కాదు’.
రానా దగ్గుబాటి సమర్పణలో నివేత థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’35-చిన్న కథ కాదు’. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక కుటుంబంలో.. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువుల చుట్టే తిరిగే కథాంశంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో నివేతా, విశ్వదేవ్ భార్య భర్తల పాత్రలో కనిపించగా.. ప్రియదర్శి స్కూల్ లో లెక్కల మాస్టర్ పాత్రలో కనిపించాడు.
‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
తమిళ్ స్టార్ విజయ దళపతి మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సెప్టెంబర్ 5న ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరీ కథానాయికగా నటించగా.. అలనాటి హీరోయిన్స్ స్నేహ, లైలాతో పాటు ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘జనక అయితే గనక’
ఇటీవలే ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ సూపర్ తర్వాత సుహాస్ హీరోగా రాబోతున్న చిత్రం ‘జనక అయితే గనక’. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: This Week Movies: ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే – Rtvlive.com