Radhika Apte: బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే బోల్డ్ షోతో అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. తెలుగులో రక్త చరిత్ర, ధోని, లెజెండ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె సౌత్ ఇండస్ట్రీలో భారీ ఆదరణ దక్కించుకుంది. అయితే కొంతకాలానికి సరైన అవకాశాలు లేక ఓటీటీ చిత్రాల్లోనూ నటించేందుకు మొగ్గు చూపిన ఆమె.. నెమ్మదిగా అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. పలు వెబ్ సిరీస్, సినిమాల్లో ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయింది. ఇదే అదనుగా వరుస అవకాశాలు దక్కించుకుంది.
View this post on Instagram
బోల్డ్ ఫర్మార్మెన్స్ కు ఫిదా..
ఈ క్రమంలోనే రాధిక బోల్డ్ ఫర్మార్మెన్స్ కు ఫిదా అయిన హాలీవుడ్ మేకర్స్ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమా చాన్స్ ఇచ్చారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటిని ప్రధాన పాత్రకు సెలక్ట్ చేసి నటనా పరంగా కావాల్సినంత వాడేసుకున్నారు. రాధిక సైతం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో పాపులర్ అయిన దేవ్ పటేల్‌తో ఈ చిత్రంలో అదరగొట్టేసింది. బ్రిటీష్-అమెరికన్ మూవీగా తెరకెక్కిన చిత్రం 2019లో థియేటర్ లో రిలీజైంది. అయితే ఇండియాలో మాత్రం విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమాను భారత ప్రేక్షకులకు అందించేందుకు ఓటీటీని వేదికగా చేసుకున్నారు దర్శకనిర్మాతలు.
ఇది కూడా చదవండి: Dhanush: మతి స్థిమితం కోల్పోయిన స్టార్ హీరో.. గుడి ముందు గుబురు గడ్డంతో!
లో దస్తుల్లో రెచ్చిపోయిన రాధికా, దేవ్..
ఇందులో భాగంగానే నెట్‌ప్లిక్స్‌తో ఒప్పందం కుదర్చుకోగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలలో విడుదలైన మూవీ దాదాపు 5ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. అయితే ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. లో దుస్తుల సీన్లపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అభిమానుల ఆగ్రహంపై స్పందించిన రాధికా.. బోల్డ్ సీన్స్‌లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని చెప్పిది. చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశా. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరిస్తుండగా.. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.