సంగీతం మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది…ఉత్తేజాన్నిస్తుంది. అయితే ఒకప్పుడు దీన్ని కేవలం హాబీ కిందనే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మ్యూజిక్ ఇప్పుడు ఆదాయవనరుగా కూడా మారింది. ఎందరో దీన్ని ఆసరాగా చేసుకుని మంచిగా సంపాదిస్తున్నారు. ఏ ఆర్ రహ్మాన్ వంటివారు ఆస్కార్లు కూడా అందుకుంటున్నారు. 2022 ఏడాదిలో భారతదేశంలో మ్యూజిక్ 12వేల కోట్ల వ్యాపారం సాగించింది అంటేనే తెలుస్తోంది…అది ప్రజల్లో ఎంతగా విస్తరించిందో. ఇది రాను రాను పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు.
Also read:నిరుద్యోగులకు గుడ్స్యూస్..ఎయిర్ ఫోర్స్‌లో 3500 జాబ్స్
ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా సర్వే..
ది రైజ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా 2023 ఏడాదికి సర్వే నిర్వహించింది. ఇందులో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. ఇవి చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇండియాలో మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాలలో 2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుంటే అందులో 6శాతం వాటా మ్యూజిక్ ఇండస్ట్రీనే కలిగి ఉంది. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో ఇప్పటికే ఉన్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీతో స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే చెబుతోంది. దీని వలన మ్యూజిక్ కంపోజర్లు, లిరిసిస్టులు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య కూడా పెరుగుతోందని సర్వే ద్వారా తెలుస్తోంది.
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న భారతీయ పాటలు..
సంగీతం ప్రపంచాన్నే ఏలుతోంది ఇప్పుడు. భాషతో సంబంధం లేకుండా పాటలను వింటున్నారు. దీనికి ఉదాహరణే…తాజాగా యానిమల్ సినిమాతో పాపులర్ అయిన జమాల్ కుడు సాంగ్. ఇది నిజానికి ఇరానియన్ పాట. కానీ యానిమల్ సినిమా తర్వాత భారత్‌లో విపరీతంగా పాపులర్ అయిపోయింది. లిరిక్స్ తెలియకపోయినా జనాల నోళ్ళల్లో నానిందీ పాట. అన్నింటికన్నా కిక్కిచ్చే విషయం ఏంటంటే యూట్యూబ్‌లో ప్రపంచ టాప్ టెన్ సాంగ్స్‌లో ఏడు మనవే అంట. అందులో రెండు తెలుగు పాటలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమాలో రారా సామీ పాట టాప్ ప్లేస్‌లో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. తరువాత ఇంద్రావతి చౌహాన్ పాడిన ఊ అంటావా పాటను 1.52 బిలియన్ల మంది చూశారుట.