నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ టాప్ వన్ హీరోయిన్ ఎదిగేందుకు ఆరాటపడుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న ఆమె ఇటీవల రణ్ బీర్ హీరోగా వచ్చిన ‘యానిమల్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుండగా తాను రెస్ట్ లేకుండా పనిచేసేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతోంది.
After The epic success #Animal
Welcome back National crush @iamRashmika garu to Hyderabad#TheGirlFriend takes off from tomorrow 😍 pic.twitter.com/W84MyzQxOL— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2023
ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రష్మిక.. టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో అభిమానులను అలరించబోతుంది. ఈ చిత్రానికి యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలిపింది. 20 రోజులపాటు సాగనున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లో రష్మిక మందన్నాతోపాటు పలువురు పాపులర్ యాక్టర్లు జాయిన్ అయ్యారని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కూడా కీ రోల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. రష్మిక మందన్నా ఖాతాలో పాన్ ఇండియా ప్రాజెక్టు ‘పుష్ప.. ది రూల్’ కూడా ఉండగా ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు ‘రెయిన్ బో’లోనూ నటిస్తోంది రష్మిక.
Also read :శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!
ఇదిలావుంటే.. హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెరపై వివిధ ఫొటోలు వస్తున్న వేళ సడెన్ గా విజయ్, రష్మిక మాల్దీవ్స్ ఫొటో రావడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇది సరికాదంటూ తర్వాత అభిమానులు నానికి క్లాస్ పీకారు. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని దీనిపై స్పందించాడు. ఎవరైనా బాధ పడి ఉంటే క్షమాపణ కోరుతున్నానని చెప్పాడు. అలా జరగడం దురదృష్టం. అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే దానిని తీసేశారు. మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. విజయ్, రష్మికలకు ఇలాంటివి జరుగుతుంటాయని తెలుసు. కానీ ఎవరైనా దీనివల్ల బాధి ఉంటే క్షమించండి. నా టీమ్ కూడా క్షమాపణ కోరింది. ఇది ఎవరు చేశారో మాకు తెలియదు అన్నారు.
Our cutu know 6 languages 😊@iamRashmika 👌🔥❤️#RashmikaMandanna ❤️ pic.twitter.com/XqWpVgeNPq
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) October 19, 2023