Drug Bust In Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఇష్యూ (Drugs Issue) కలకలం రేపింది. ఖజాగూడలోని ‘దీ కేవ్ పఫ్ క్లబ్’ (Cave Puff Club) లో పలువురు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. 50 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు తెలిపారు. పట్టబడ్డవారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లతోపాటు ఇకెంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించామని, అదుపులోకి తీసుకున్నవారిని నేడు కోర్టులో హాజరుపరుచనున్నట్లు వెల్లడించారు.
Also Read : UEFA టోర్నీలో సంచలనం.. సెమీస్ రేసులో ఇంగ్లండ్ vs నెదర్లాండ్స్