Naga Chaitanya’s Thandel Movie Release Postponed : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీ శరవేగంగా తెరకెక్కుతోంది.
శ్రీకాకులం జిల్లాకు చెందిన పలువురు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లి, పాకిస్తాన్ అధికారులు పట్టుబడుతారు. వాళ్లు తిరిగి ఇండియాకు ఎలా వచ్చారు? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య చేపలు పట్టే యువకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also Read : ‘భారతీయుడు 2’ కు నెగిటివ్ రివ్యూలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబీ సింహా!
రిలీజ్ వాయిదా…
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 20 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించగా.. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనుందని తాజా సమాచారం బయటికొచ్చింది. ఇందుకు కారణం డిసెంబర్ నెలలో పలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతుండడమే అని తెలిసింది.
వచ్చే ఏడాది థియేటర్స్ లో…
అల్లు అర్జున్ పుష్ప ది రూల్, రాంచరణ్ గేమ్ ఛేంజర్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలతోపాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా డిసెంబర్లోనే రాబోతున్నాయి. ఇలా వరుస సినిమాలు లైన్లో ఉన్న నేపథ్యంలో తండేల్‌ను 2025 జనవరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.