Thandel Movie: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూడవ చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత మరో సారి వీళ్లిద్దరి కాంబో రిపీట్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టీజర్ లోని సాయి పల్లవి, నాగచైతన్య విజువల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక చందు మొండేటి చేసిన ప్రేమమ్ , కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
Also Read: Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్
మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర బృందం ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
తండేల్ వర్కింగ్ స్టిల్స్
“తండేల్ చిత్ర బృందం ఈ అందమైన గ్రామంలో ఒక షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు.. ఇక్కడ ఓడరేవు, గ్రామానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించాము. త్వరలో సినిమా నుంచి రాబోతున్న కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి” అంటూ చిత్రీకరణ ఫోటోలను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫొటోల్లో అచ్చం పల్లెటూరి అమ్మాయి గెటప్ లో సాయి పల్లవి కనిపిస్తోంది.
View this post on Instagram
Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో