Thandel Movie: నాగచైతన్య.. సాయిపల్లవి 'తండేల్' వర్కింగ్ స్టిల్స్ .. చైతూ లుక్ అదిరిందిగా.. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర బృందం ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. By Archana 09 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Thandel Movie: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూడవ చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత మరో సారి వీళ్లిద్దరి కాంబో రిపీట్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టీజర్ లోని సాయి పల్లవి, నాగచైతన్య విజువల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక చందు మొండేటి చేసిన ప్రేమమ్ , కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. Also Read: Eagle Trailer: “దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను”.. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్ మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర బృందం ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తండేల్ వర్కింగ్ స్టిల్స్ "తండేల్ చిత్ర బృందం ఈ అందమైన గ్రామంలో ఒక షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు.. ఇక్కడ ఓడరేవు, గ్రామానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించాము. త్వరలో సినిమా నుంచి రాబోతున్న కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి" అంటూ చిత్రీకరణ ఫోటోలను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫొటోల్లో అచ్చం పల్లెటూరి అమ్మాయి గెటప్ లో సాయి పల్లవి కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Geetha Arts (@geethaarts) Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో #thandel-movie-shooting-stills #thandel-movie-behind-the-scene-images మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి