TG NAB: టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1892 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంలో ఇప్పటి వరకు 3792 మంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 179.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 679 గంజాయి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 42 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 102.41 కోట్లు విలువ చేసే గంజాయి ధ్వంసం చేసినట్లు తెలిపారు.
డ్రగ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..
- మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డ్రగ్స్, సైబర్ నేరాలు: సీఎం రేవంత్ రెడ్డి
- విద్యార్థులు ఎక్కువగా గంజాయికి బానిసలు అవుతున్నారు
- హత్య, అత్యాచారం కన్నా..ఈ కాలంలో సైబర్ నేరాలనేవి పెద్దవి
- హత్య చేస్తే ఒకరో ఇద్దరో చనిపోతారు..సైబర్ మోసంలో చాలామంది బాధితులు చిక్కుకుంటారు
- మధ్యతరగతి, పేదలే సైబర్ నేరాళ్లకు గురవుతున్నారు