INDIA: భారతదేశంలో ఉన్న 24 విమానశ్రయాలకు ఉగ్రముప్పు పొంచివున్నట్లు ‘టెర్రరైజర్స్ 111’ గ్రూప్ నుంచి వచ్చిన ఇమెయిల్ భద్రతా చర్యలకు దారితీసింది. 666darktriad666@gmail.com నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే విమానాశ్రయాలకు చేరుకున్న పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కట్టుదిట్టమైన భద్రత మధ్య క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఉదయం 9.27 గంటలకు సందేశం..
సోమవారం ఉదయం 9.27 గంటలకు అందిన ఈ సందేశం భద్రతా, నిఘా వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సీనియర్ విమానాశ్రయ అధికారుల హెచ్చరికతో నాగ్పూర్ సిటీ పోలీసులు వేగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎయిర్ పోర్టులో మొహరించారు. కొన్ని ప్రత్యేకంగా విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని రక్తపాతం సృష్టించబోతున్నట్లు ఉగ్ర సంస్థ హెచ్చరికలు పంపింది. అనేక విమానాలలో భారీ పేలుడు పరికరాలను (IED) పెట్టినట్లు బెదిరింపులకు పాల్పడింది.
ఇది కూడా చదవండి: Varalaxmi: స్టార్ నటి వరలక్ష్మికి లైంగిక వేధింపులు.. అతనిపై కేసు పెట్టిన హీరో కూతురు!
అయితే ఈ ఇమెయిల్లో తీవ్రమైన బెదిరింపులున్నప్పటికి.. ఇది బూటకమని భద్రతా అధికారులు భావిస్తున్నారు. ‘మేము భద్రతను పెంచాం. నాగ్పూర్ విమానాశ్రయంలో ఎటువంటి అనుమానాస్పద చర్యలు కనిపించలేదు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలని’ పోలీసు అధికారులు సూచించారు.