Valentines Day Re-Release Movies: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల చిత్రాలను మళ్ళీ థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు పోకిరి (Pokiri) సినిమాతో ఈ రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా పలు స్టార్ హీరోల సూపర్ హిట్ రీ రిలీజ్ అయ్యాయి. ఇంకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన పలు క్లాసిక్ లవ్ సినిమాలు రీ రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. మరో సారి వెండితెర పై సందడి చేయనున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
తొలి ప్రేమ
ప్రేమ కథ నేపత్యంలో వచ్చిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ (Pawan Kalyan Tholi Prema) చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1998 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సూపర్ హిట్ లవ్ స్టోరీగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా మరో సారి థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది.
ఓయ్
లవర్ బాయ్ సిద్దార్థ్ (Siddharth), షామిలీ నటించిన చిత్రం ఓయ్. 2009లో విడుదలైన ఈ చిత్రం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఎమోషనల్ ప్రేమ కథగా ఆకట్టుకున్న ఓయ్ (Oye) దాదాపు 15 ఏళ్ల తరువాత.. వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో ఎంపిక చేసిన థియేటర్స్ లో ఈ మూవీ రానుంది.
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వాసుదేవ్ మేనన్ కాంబోలో వచ్చిన చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ (Surya Son of Krishnan). 2008 లో విడుదలైన సూపర్ హిట్ అయిన ఈ చిత్రం గతేడాది ఆగస్టు 4న రీ రిలీజ్ అయ్యి.. ఊహించని రెస్పాన్స్ అందుకుంది. మరో సారి వాలెంటైన్స్ డే (Valentine’s Day 2024) సందర్భంగా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానుంది.
సీతారామం
రీసెంట్ గా విడుదలైన ‘సీతారామం’ (Sitaramam) పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే రోజున మరో సారి రీ రిలీజ్ కానుంది.
Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!