Telangana Exit Polls: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసినా.. ఫలితం ఎవరికి అనుకూలం అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోటీలో నిలిచి అభ్యర్థులు, పార్టీల పరిస్థితి ఏమోగానీ.. ప్రజల పరిస్థితి మాత్రం భూమిపై నిలబడలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ వెలువడినా.. అవన్నీ ఎటూ తేల్చలేదు. తాజాగా ప్రఖ్యాత సర్వే సంస్థ మిషన్ చాణక్య తన ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. మిషన్ చాణక్య కూడా తెలంగాణలో ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.
మిషన్ చాణక్య ప్రకారం.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 43-55 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 35 నుంచి 48 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ 6 – 10, ఎంఐఎం 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read:
చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?