The liveblog has ended.
No liveblog updates yet.
Published on by Trinath
Published on by Shiva.K
Minister KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసిన ఆయన.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్ట్ చేశారనేగా వేయిటింగ్. తెలంగాణలో మూడవ సారి విజయం సాధించడం ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఆ విశ్వాసంతోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తాను తుపాకీ ఎక్కి పెట్టి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. ‘హ్యాట్రిక్ లోడింగ్.. గెట్ రెడీ టూ సెలబ్రేట్ గాయ్స్’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
Hattrick Loading 3.0 👍
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
— KTR (@KTRBRS) December 2, 2023
కేటీఆర్ పోస్ట్‌తో బీఆర్ఎస్ శ్రేణులు సరికొత్త జోష్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఆయన ట్వీట్‌ను రీట్వీట్, పోస్టులను రీపోస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ విజయం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు.
Also Read:
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు..
Published on by V. J. Reddy
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రచారానికి మరో రెండు రోజుల సమాయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున ప్రచారంలో దుసుకుపోతున్నారు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
ALSO READ: లోకేష్ యువగళం.. రేపటి నుంచి షురూ!
తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై చురకలు అంటించారు. రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారు అని అన్నారు. కేసీఆర్ మాత్రం పక్క లోకల్ అని తేల్చి చెప్పారు. అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచింది గాంధీ కుటుంబం అని పేర్కొన్నారు.
తెలంగాణకు తీరని మోసం చేసింది గాంధీ కుటుంబమే అంటూ ధ్వజమెత్తారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ?.. రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా?కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా… బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ? కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ? అని తెలంగాణ ప్రజలకు ప్రశ్నించారు. దారుణ పరిస్థితి మళ్లీ రావద్దంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
ALSO READ: తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక!
Published on by Shiva.K
Vijayashanti: బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్(Congress)లో చేరానని విజయశాంతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. గతంలో కాంగ్రెస్ విడిచి బీజేపీ(BJP)కి వెళ్ళడానికి కారణం చెప్పారు. అవినీతి పరుడైన కేసీఆర్‌ను జైల్లో వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందని, ఆ కారణంగానే బీజేపీలో చేరామన్నారు. నెలలు, సంవత్సరాలు గడిచినా కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మోడీ, అమిత్ షా, నడ్డా.. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ అవినీతిపరుడని, కుటుంబ పాలన చేస్తున్నారని కామెంట్స్ చేశారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు విజయశాంతి.
కేసీఆర్ అవినీతిపై ఆధారాలతో సహా అన్ని వివరాలు వారి దగ్గర ఉన్నాయని, అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు రాములమ్మ. ఏటీఎం, కుటుంబ పాలన, దొంగ అని పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తారు తప్ప చర్యలు మాత్రం శూన్యం అని అన్నారు. ప్రధాని మోదీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉందని, అయినప్పటికీ కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు విజయశాంతి. కేసీఆర్‌పై చర్యలు తీసుకోనందుకే బీజేపీని వీడామన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు విజయశాంతి. తెర ముందు ఒకలా.. తెర వెనుక ఒకలా మత్లాడుతున్నారని విమర్శించారామె. వీరి ఆటలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులు పిచ్చోళ్ళు అయ్యారని అన్నారు. చివరి నిముషం వరకు యాక్షన్ తీసుకుంటారని చూశానని, కానీ అలా జరుగలేదన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు విజయశాంతి.
బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారని కూడా ప్రశ్నించానన్నారు. ఎన్నికలకు 4 నెలల ముందు అధ్యక్షుడిని మారిస్తే బీజేపీ డిజాస్టర్ అవుతుందని కూడా చెప్పానన్నారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఆయనను తొలగించారన్నారు. బీజేపీలో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటరని, ఆ నాయకుడే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని పదె పదె చెప్పారని ఆరోపించారు విజయశాంతి. ఆయన చెప్పింది నమ్మి.. అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిందన్నారు. ఆ వ్యక్తి మీద నమోదైన అసైన్డ్ భూముల కేసు ఏమైందని ప్రశ్నించారు విజయశాంతి. పరోక్షంగా ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి ఆమె ఈ కామెంట్స్ చేశారు.
బీజేపీ చేజేతులా వారి పార్టీని వారే నాశనం చేసుకున్నారని అన్నారు విజయశాంతి. బీఆర్ఎస్, బీజేపీలు తెర ముందు ఒకలా తెర వెనుక ఒకలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారామె. రెండు పార్టీల మధ్య వైరమే ఉంటే.. కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారామె. మెడిగడ్డ పిల్లర్లు కుంగినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఒప్పందం ప్రకారమే చేసారా? అని ప్రశ్నించారు. తనను తిట్టే హక్కు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. తాను డబ్బు కోసం, పదవుల కోసం తలొగ్గని అన్నారు. తన గురువు అద్వానీ నుంచి విలువైన రాజకీయాలు నేర్చుకున్నానన్న విజయశాంతి.. ఇప్పటి బీజేపీ నేతలుకు ఇప్పుడు అలాంటి విలువలు లేవన్నారు. కొంతమంది లీడర్లు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపించాలని పిలుపునిచ్చారు విజయశాంతి. బీజేపీ తనను మోసం చేసింది తప్ప.. తాను ఎవరినీ మోసం చేయలేదని అన్నారామె.
Also Read:
ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..
రెండోసారి బీజేపీకి గుడ్ బై చెప్పిన రాములమ్మ.. ఈసారి పార్టీని వీడటానికి ఆయనే కారణమా?!