Lok Poll Survey – Telangana Elections: దేశం మొత్తం ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో కూడా హడావుడి మొదలైంది. రేపో మాపో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తుల ప్రారంభించేశాయి. బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్ధుల లిస్ట్ ను కూడా విడుదల చేసింది. మిగతా పార్టీలు తొందరలోనే చేస్తారు. ప్రచారాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. తెలంగాణలో ఈసారి కూడా తమదే అధికారం అని బీఆర్ఎస్ అంటోంది. హ్యాట్రిక్ కచ్చితంగా కొడతామని చెబుతోంది. కానీ కాంగ్రెస్ (Congress) , బీజెపీ (BJP) నేతలు ఎలా అయినా బీఆర్ఎస్ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు కూడా తమ పలితాలను వెల్లడిస్తున్నాయి. అందరూ మళ్ళీ తెలంగాణకే పట్టం కడుతుంటే లోక్ పోల్ సర్వే మాత్రం (Lok Poll Survey) కాంగ్రెస్కు పట్టం కట్టింది. దీంతో ఈ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
లోక్ పోల్ సర్వేలో మాత్రం హస్తానిదే హవా నడుస్తుందని తేలింది. లోక్ పోల్ ప్రీపోల్ సర్వేలో అధికార బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 సీట్లు మాత్రమే వస్తాయని.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 61 నుంచి 67 సీట్లు రానున్నట్టు చెబుతోంది. ఇక ఈసారి తెలంగాణలో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్న బీజేపీ మాత్రం 2 నుంచి 3 సీట్లకే పరిమితం కానుందని లోక్ పోల్ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇక ఏఐఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని.. ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశాలున్నట్టు పలితాల్లో తేలింది.
ఈ సర్వేలో సీట్ల విషయంలో బీఆర్ఎస్కు, కాంగ్రెస్ కు 15 సీట్లకు పైగానే వ్యత్యాసం కనిపిస్తోన్నా.. ఓటింగ్ విషయంలో మాత్రం పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 42 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్కు కూడా 41 నుంచి 44 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని సర్వే చెప్తోంది. ఇక 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకునే బీజేపీ మాత్రం 10 నుంచి 12 శాతం ఓటింగ్ సంపాధించుకునే అవకాశం ఉంది. కాగా.. ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం పార్టీకి మాత్రం మూడు నుంచి 4 శాతం ఓటింగే వచ్చే అవకాశం ఉందని లోక్ పోల్ సర్వేలో తేలింది.
After conducting a thorough ground survey from August 10th to September 30th across the state, we are pleased to present the results of the Mega #Telangana pre-poll survey.
▪️BRS 45 – 51
▪️INC 61 – 67
▪️AIMIM 6 – 8
▪️BJP 2 – 3
▪️OTH 0 – 1… pic.twitter.com/QulbMAbmmQ— Lok Poll (@LokPoll) October 5, 2023
సీటుకు నోటు దొంగ…
లోక్ సోల్ సర్వే మీద బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇదంతా రేవంత్ (Revanth Reddy) సృష్టి అని విమర్శించారు. దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ కాతాలో పోస్ట్ చేశారు. ఓటుకు నోటు దొంగ ఇప్పుడు సీటుకు నోటు దొంగగా మారాడని…జాగ్రత్తగా ఉండాలని శ్రవణ్ తన పోస్ట్ లో రాశారు. సమర్ధులైన అభ్యర్ధులే లేరు కానీ మెజారిటీ సీట్లు గెలుస్తారని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు రేంటెంత రెడ్డి, కొనుగోలు సునీల్ అంటూ వెటకారం చేశారు.
ఓటుకు నోటు దొంగ ఇప్పుడు సీటుకు నోటు దొంగగా మారిండు.. తస్మాత్ జాగ్రత్త..
ఫేక్ సర్వే రిపోర్టులతో టిక్కెట్ల కోసం పోటీ పెంచి, కోట్లకొద్దీ నోట్లు దండుకునే చిల్లర కుట్ర చేస్తున్న రేటెంత” రెడ్డి మరియు “కొనుగోలు” సునీల్
అసెంబ్లీ ఎన్నికల పేరుమీద ఇప్పటికే కోట్లకొద్దీ రూపాయల మరియు భూముల… pic.twitter.com/gkb9lzBApP
— Prof Dasoju Srravan (@sravandasoju) October 6, 2023
Also Read: జ్యూస్ షాప్, టైర్ షాప్…మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.