TDP Ticket War: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికల జరగనున్న వేళ టీడీపీలో టికెట్ల పంచాయతీ షురూ అయింది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే రెండు విడతల్లో 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కాగా మిగిలిన 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను అలాగే 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటి రెండు జాబితాల్లో టికెట్ రాని కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ రాక భంగపడ్డ కొందరిని బుజ్జగించే పనిలో పడింది టీడీపీ అధిష్టానం.
ALSO READ: నాదెండ్ల మనోహర్‌తో వంగవీటి రాధా భేటీ
ముదిరిన కంది టికెట్ పంచాయతీ..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే 34 మంది అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంది టికెట్ ను కదిరిలో కూడా కందికుంట ప్రసాద్‌కు కాకుండా ఆయన భార్య యశోదకు కేటాయించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా కు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న అత్తర్ చాంద్ భాషాకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. హిందూపురం ఎంపీ టికెట్ ను ఇచ్చిన గెలిపించుకుంటామని కోరుతున్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలతో మాట్లాడి సర్ది చెప్పారు నారా లోకేష్. చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాంద్ బాషా అనుచరులకు హామీ ఇచ్చారు.
హైదరాబాద్ లో కోట్ల సుజాతమ్మ వర్గం ఆందోళనలు…
హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటివద్ద ఆలూరు టీడీపి కార్యకర్తల ఆందోళనకు దిగారు. కోట్ల సుజాతమ్మ ఆలూరు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులతో గెలిచే అభ్యర్థులకు కాదని … వేరేవారికి సీటు కేటాయిస్తారా? అంటూ సుజాతమ్మ అనుచరులు నినాదాలు చేపట్టారు.