CM Jagan: కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బీజేపీ అధిష్టానం ఫోన్ చేసిందని.. మేనిఫెస్టోలో మీ ఫోటో పెట్టుకోండి కానీ మోడీ ఫొటో పెట్టుకోవద్దని హెచ్చరించిందని అన్నారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయిందని అన్నారు. కూటమిలో ముగ్గురి ఫోటోలు పెట్టుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారని ఫైర్ అయ్యారు.
TDP Janasena Manifesto
Chandrababu: ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు..
Chandrababu AnNounces Free Schemes: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అటు అధికార వైసీపీ.. ఇటు విపక్ష టీడీపీ-జనసేనలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రజలపై ఎన్నికల వరాల జల్లు కురిపించారు. ప్రకటించిన ప్రతి పథకం సంచలనమే అన్నట్లుగా ఉంది.
మహాశక్తి కార్యక్రమం కింద.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడ బిడ్డకు నెలకు రూ. 1500 ఇస్తామని ప్రకటించారు. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లల తల్లులకు సంవత్సరానికి రూ. 15 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే.. ఐదేళ వ్యవధిలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు బాబు. నిరుద్యోగులకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యలో తెలుగు యువతను ప్రపంచ స్థాయిలో నిలబెడతామన్నారు.
Also Read: ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..
వైఎస్ జగన్ పాలనలో కునారిల్లిన వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తామని, అన్నదాత కార్యక్రమంలో భాగంగా రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు చంద్రబాబు. బీసీ రక్షణ చట్టం తీసుకుస్తామన్నారు. ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఒక కార్యక్రమం తయారు చేసి ప్రణాలికను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. భవిష్యత్లో ఇంకా ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేసి.. మరిన్ని పథకాలకు శ్రీకారం చుడతామని చెప్పారు టీడీపీ అధినేత. అమరావతి, తిరుపతిలో మీటింగ్స్ ఏర్పాటు చేసి.. ఆ సభల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. రానున్నది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని, ఏపీలో జగన్ పని అయిపోయిందన్నారు చంద్రబాబు. రేపు జరుగనున్న కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం అని, ప్రజలు ఇప్పటి నిర్ణయించేశారని అన్నారు బాబు.
Also Read: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..