Tamil Nadu Rain Effect : డిసెంబర్ అంటేనే తమిళ ప్రజలు భయపడి పోయే పరిస్థితి. ప్రతీఏడాది ఈ నెలలో అక్కడ ఏదో ఒక విపత్తు సంభవిస్తుంటుంది. భారీ వర్షాలకు, వదరలకు పదులు సంఖ్యలో ప్రాణాలు పోతుంటాయి. భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లుతుంది. ఈ ఏడాది కూడా అదే జిరిగింది భారీ వర్షాలకు ఇళ్లలకు ఇళ్లు నీట మునిగాయి. అంతేకాదు చాలా మంది వర్షానికి బలైపోయారు. ఎన్నో కుటుంబాలు మరోసారి వీధిన పడ్డాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) చెప్పారు.
#WATCH | Tamil Nadu: Heavy rains in Tirunelveli create flood-like situations; visuals from Courtallam Waterfalls and Manimutharu Waterfalls pic.twitter.com/q2sAjZAqAa
— ANI (@ANI) December 17, 2023
స్టాలిన్‌పై విమర్శలు:
అటు తమిళనాడు సీఎం స్టాలిన్(Stalin)పై నిర్మలా తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో ఇంత భారీ విపత్తు చోటుచేసుకుంటుంటే INDIA కూటమితో పాటు స్టాలిన్ ఢిల్లీలో ఉన్నారంటూ మండిపడ్డారు. తమిళనాడుకు ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగించేందుకు కేంద్రం ఇప్పటికే రెండు విడతలుగా రూ.900 కోట్ల నిధులను విడుదల చేసిందని ఆమె గుర్తు చేశారు. చెన్నైలో మూడు డాప్లర్‌లతో సహా అత్యాధునిక పరికరాలు ఉన్నాయని తెలిపారు. వాతావరణం గురించి ఆలస్యంగా సమాచారం ఇచ్చారన్న డీఎంకే మంత్రి మనో తంగరాజ్ వాదనను తిప్పికొట్టిన నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై రివర్స్ అటాక్ చేశారు. 2015లో విపరీతమైన వర్షపాతం చూశామని.. నష్టాలను భర్తీ చేయడానికి తమిళనాడు ప్రభుత్వం రూ. 4,000 కోట్ల సహాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు నిర్మల.
#WATCH | Tamil Nadu: Heavy rains in Tirunelveli create flood-like situations; visuals from Manimutharu Waterfalls. (19.12) pic.twitter.com/yorfFj16Ni
— ANI (@ANI) December 20, 2023
జాతీయ విపత్తుపై ప్రకటన:
తమిళనాడులో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వరదలను ‘జాతీయ విపత్తు’గా ఎందుకు ప్రకటించలేదో చెప్పుకొచ్చారు నిర్మల. ‘జాతీయ విపత్తు అనే ప్రకటన ఎప్పుడూ లేదు. ఉత్తరాఖండ్‌కు కూడా మేము అలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఏ రాష్ట్రమైనా విపత్తును ప్రకటించడానికి మార్గదర్శకాలు ఉన్నాయి’ అని సీతారామన్ అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తీవ్ర వరదలతో అతలాకుతలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తగినన్ని సహాయ నిధులు విడుదల చేయడం లేదని స్టాలిన్ చేసిన ఆరోపణల తర్వాత నిర్మల ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు రూ.6,000 వరద సాయంతో పాటు తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లో బాధిత కుటుంబానికి రూ.1,000 అందజేస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఈ రెండు జిల్లాలతో డిసెంబర్ 17 , 18 తేదీల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు వచ్చాయి.
Also Read: జాక్వెలిన్ రహస్యాలన్నీ బయటపెడతా.. మాజీ ప్రేయసిపై ఆగ్రహంగా సుకేశ్!
WATCH: