Balapur Murder Case: బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రశాంత్ ని అతని స్నేహితులే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలాపూర్ చౌరస్తా వద్ద ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. నిందితులను పట్టుకునేందుకు డీసీపీ సునీతా రెడ్డి ఓ ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు.
చనిపోయిన ప్రశాంత్ తో పాటు నిందితులు కూడా ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, హత్య చేసి పరారైన నిందితులను బాలాపూర్ పోలీసులు కొంతసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు.
బాలాపూర్ హత్య ను సవాలు గా తీసుకున్న డీసీపీ సునీతా రెడ్డి..కేవలం మూడు గంటల్లోనే నిందితుల ను పట్టుకున్నారు.ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలపనున్నారు.