Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత పెద్ద స్టార్ గా ఎదిగినప్పటికీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. బయట చాలా సందర్భాల్లో కూడా రజినీకాంత్ సింప్లిసిటీ అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే తాజాగా రజినీకాంత్ తన మనవడితో కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
మనవడిని స్కూల్ కు తీసుకెళ్లిన తలైవ
సూపర్ స్టార్ రజినీ కాంత్ తాతయ్యగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న ఆయన మనవడిని స్వయంగా స్కూల్ లో దింపడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ తరగతి గదిలో ఇతర పిల్లలతో మాట్లాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీ కాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. “ఈ రోజు ఉదయం నా కొడుకు స్కూల్‌కి వెళ్ళడానికి మారం చేశాడు. దాంతో సూపర్‌హీరో తాత తనని స్వయంగా స్కూల్‌కి తీసుకెళ్లారు. బెస్ట్ గ్రాండ్ ఫాదర్ #బెస్ట్ ఫాదర్ #జస్ట్ ది బెస్ట్ అని పోస్ట్ పెట్టింది”.
View this post on Instagram
Also Read: MR.& MRS. MAHI: ఓటీటీలో జాన్వీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ .. స్ట్రీమింగ్ ఇక్కడే..? – Rtvlive.com