బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సక్సెస్ సీక్రెట్ ఎంటో తెలిసిపోయింది. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ సంపాదించుకుంది. సీనియర్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న అలియా ఇటీవలే పడంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ తన ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోవడం వెనక చాలా శ్రమ ఉంటుదంటున్నాడు ఆమె ఫిట్నెస్ కోచ్ సోహ్రబ్ ఖుష్రుర్ షాహి. అంతేకాదు ప్రతి సినిమాకోసం ఆమె తెర వెనుక చేసే హార్డ్‌వర్క్, డెడికేషన్ అద్భుతమని పొగిడేశారు. ఈ క్రమంలోనే అలియా వర్కవుట్ సెషన్స్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also read : ఆ కేసులో నమిత భర్తకు షాక్ ఇచ్చిన పోలీసులు.. సమన్లు జారీ
ఈ మేరకు ఒకవైపు నటిగా మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్న అలియా కష్టపడే తీరు ఎంతోమందిని మెప్పించింది. అయితే తన ఫిట్ నెస్, గ్లామర్, ఎనర్జీ ఎల్లప్పుడూ కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతుందన్న సోహ్రబ్ ఆమె వర్కవుట్ సెషన్స్ చూస్తే సక్సెస్ సీక్రెట్ తెలిసిపోతుదంటున్నారు. ఫిట్నెస్ నుంచి తనకు దక్కినవన్నింటినీ ఆమె ఎంతో చెమటోడ్చి సొంతం చేసుకుందని, తన పర్యవేక్షణలో జిమ్‌లో అలియా భట్ బరువులు ఎత్తుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ‘అలియా ఏ విషయాన్ని తేలికగా తీసుకోదు. కష్టపడి పనిచేయడం వల్లే ఆమె స్టార్‌గా వెలుగొందుతోంది. తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంది. మళ్లీ 12 గంటల వరకూ షూట్‌కు రెడీ అవుతుంది. ఇది అనుకున్నంత సామాన్యమైన విషయం కాదు. విజయానికి షార్ట్ కట్స్ లేవు. కష్టపడటం ఒక్కటే మార్గమని ఆమె నమ్ముతుంది’అంటూ వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుతండగా తమ అభిమాన నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.