మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. స్టార్ ప్లస్ లో మహాభారత్ సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైలాగ్ కింగ్ మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్పగా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. అది కూడా శివుడి పాత్రలో అని ప్రచారం సాగగా.. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్‌తో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.
అయితే ఇప్పుడిదే సినిమాలో నయనతార కూడా యాక్ట్ చేయనుందని తెలిస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ నటి మధు బాల కన్ఫామ్ చేశారు. ఆమె తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్-నయతార ప్రాజెక్ట్ లో భాగమయ్యానని చెప్పారు. దీంతో ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా నయన్ పార్వతిగా కనిపించనుందని బయట టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట నూపుర్ సనన్ ఎంపిక చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది.
యోగి సినిమా తర్వాత అంటే.. దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ ప్రభాస్-నయన్ నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే నయన్.. పలు సినిమాల్లో అమ్మవారిగా కనిపించి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే కన్నప్ప చిత్రం విషయానికొస్తే.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి స్వరాలు సమకూరుస్తున్నారు.
కన్నప్ప సినిమా మొత్తాన్ని న్యూజిలాండ్ లో జరగనుంది. ఒక్క షెడ్యూల్ లో మొత్తం సినిమాను పూర్తి చేస్తామని మంచు విష్ణు ఆల్రెడీ ప్రకటించారు. రీసెంట్ గా 800 మంది సిబ్బందితో 5 నెలల పాటూ ఆర్ట్ వర్క్ పూర్తి చేయించినట్లు విష్ణు చెప్పారు. దీనికి సంబంధించిన మొత్తం సామాగ్రిని 8 కంటెయినర్లలో న్యూజిలాండ్ కు తరలించారు. ఈ ఆర్ట్ వర్క్ కు సంబంధించి మేకింగ్ వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో కూడా పంచుకుంది.
Actress Madhubala confirms Prabhas and Nayanthara being part of #Kannappa ❤
We're gonna witness this pair after 16 years 🛐#Nayanthara #Prabhas pic.twitter.com/BsID28kYEI
— N'cafe 💫 (@NayanCafe) September 23, 2023