Rhea Chakraborty: బాలీవుడ్ దివంగత నటుడు సూశాంత్ సింగ్ రాజ్ పుత్ (Shushanth) సూసైడ్ (sucide) కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి తన జైలు (Jail) జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు సుశాంత్‌సింగ్ మర్డర్ కేసు సినీ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో సుశాంత్ ప్రియురాలుతోపాటు రియా చక్రవర్తిని అరెస్ట్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెలరోజులపాటు జైలుశిక్ష అనుభవించి బయటికొచిన ఆమె.. రీసెంట్ గా ప్రముఖ రచయిత చేతన్ భగత్ టాక్ షోలో పాల్గొని తను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టింది.
About last night ! Thank you @filmfare for always adding the zing to the Bollywood bling ! @NehaDhupia you’re a legend host my friend !
Ps – my attempt to being the black lady myself #rheality pic.twitter.com/v0UEhcRNY4
— Rhea Chakraborty (@Tweet2Rhea) February 3, 2020
పడుకునే పక్కనే టాయిలెట్..
ఈ మేరకు ‘జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లు. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేది. అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాణ్ని. ఇక నేను పడుకునే పక్కనే టాయిలెట్ ఉండేది. ఇలాంటివి ఎన్నో పరిస్థితులు. కానీ.. ఆ సమయంలో పడిన శారీరక బాధలకన్నా.. అనుభవించిన మానసిక క్షోభే ఎక్కువగా ఉండేది. అయినా ఒక్కోసారి మిగతా ఖైదీలతో పోలిస్తే నా పరిస్థితి బాగానే ఉంది అనిపించేది’ అని చెప్పింది.
ఇది కూడా చదవండి : Shivam Dube: మహీ భాయ్ చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా: సిక్సర్ల దూబె
నాగిన్ డ్యాన్స్..
అలాగే జైలు శిక్ష అనుభవిస్తు్న్న కొంతమందికి బెయిల్ దొరికినా రూ.5వేలు, రూ.10వేలు కట్టలేక బయటికి వెళ్లలేకపోయేవారని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది. ఇక తనకు బెయిల్ వచ్చినప్పుడు ‘మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ రూపంలో చెప్పండి’ అన్నారు కొందరు. నేను వెంటనే ‘నాగిన్ గిన్ గిన్..’ పాటకి డ్యాన్స్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా ఆ అనుభవాలు గుర్తొస్తే మనసు అదోలా ఉంటుందని, సమాజం నుంచి ఎదుర్కొన్న విమర్శలు తనను మానసిక వేదనకు గురిచేశాయని వివరించింది రియా.