Reel Gone Viral : సోషల్ మీడియా(Social Media), రీల్స్ పిచ్చి ఎంతలా పెరిగిపోతోందో చెప్పడం కూడా కష్టమవుతోంది. దీని మోజులో పడి యువత ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. కొంతమంది అయితే ప్రాణాలకు కూడా తెగిస్తున్నారు. ఆ క్రమంలో చాలా మంది చనిపోతున్నారు కూడా. దీంతో పాటూ రీల్స్ కోసం పబ్లిక్ ప్లేస్(Public Place) లు, గోప్యంగా ఉంచాల్సిన విషయాలను సైతం వాడేసుకుంటున్నారు. అందరికన్నా భిన్నంగా ఉండాలి.. సోషల్ మీడియాలో పాపులారిటీ పెరగాలి అన్న యావతో ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా డిల్లీ(Delhi) లో ఓ యవతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఢిల్లీలో పాలికా బజార్లో ఓ యవతి షాప్ కీపర్ ముందే బట్టలు మార్చడానికి ప్రయత్నించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అయితే ఇది కొంతమంది ఢిల్లీలోని పాలికా బజార్ అంటుంటే మరికొందరు గోవా అంటున్నారు. ఏక్కడైతేనేం రీల్స్ మోజులో పడి యువతి ఇతరుల ముందే బట్టలు విప్పడానికి ప్రయత్నించింది. దాచుకోవాల్సిన శరీరాన్ని అందరి ముందే బహిర్గతం చేయడానికి కూడా వెనుకాడలేదు. దీన్ని చూసిన నెటిజన్లు ఆ యువతి మీద మండిపడుతున్నారు. మహిళలు ఇంతలా బరి తెగించడం అవసరమా అని అడుగుతున్నారు. భారత దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ తెగ తిట్టిపోస్తున్నారు.
दिल्ली के पालिका बाजार मे कपडे की दुकान पर.. #INSTA वाली लड़कियों के मुजरे के बाद अब एक नया वीडियो.. हर कपडे की दुकान पर चेंजिंग रूम उपलब्ध है मगर यहाँ इस लड़की ने हदे ही पर कर दी। संभवत: वीडियो भी खुद बनवाई या किसी ने बनाई.. यह वीडियो अब वायरल है।#viralvideo pic.twitter.com/XJfsKVchpR
— TRUE STORY (@TrueStoryUP) April 9, 2024
ప్రతీ షాప్లో ఇప్పుడు బట్టలు మార్చుకునే గదులు, ట్రయల్ రూమ్స్ ఉంటున్నాయి. కానీ వీడియోలో ఉన్న యువతి అవి ఉపయోగించుకోకుండా.. .షాప్ కీపర్(Shop Keeper) ముందే బట్టలు మార్చుకోవడానికి ప్రయత్నించింది. ఆ అమ్మాయి అన్ని హద్దులు దాటేసింది అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు చేయాలనుకోవడం తప్పు కాకపోవచ్చు కానీ అది మితిమీరితేనే చెత్తలా ఉంటుందని అంటున్నారు. మెట్రోల్లో, బస్సుల్లో చూస్తున్న వింత చేష్టలు చాలవన్నట్టు ఇప్పుడు షాపుల్లో కూడా మొదలెట్టేశారు అంటూ విసుక్కుంటున్నారు. ఇది ఇంకెంత దూరం వెళుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nothing new, this must be Palika bazar https://t.co/qIvQfZc8wn
— Devikaa (@devikaamathur) April 9, 2024
సోషల్ మీడియా వీడియోల మీద ఇంక హద్దులు పెట్టడం తప్పనిసరి అని నెటిన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం కూడా వీటి మీద ప్రోటోకాల్స్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.