Shivaji – Laya : టాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో శివాజీ-లయ జోడీ ఒకటి. ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట, దాదాపు 15 సంవత్సరాల తర్వాత మరోసారి కలిసి నటించనున్నారు.ఈ కొత్త సినిమా ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శివాజీ స్వయంగా నిర్మాత.
శివాజీ సొంత బ్యానర్‌పై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.ఈ చిత్రం యొక్క ఓపెనింగ్ ప్రోగ్రాం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కొడుకు రిక్కి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తం షాట్‌కి దర్శకత్వం వహించారు.ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు. ఆగస్ట్ 20 నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
Also Readd : మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం అదేనా?
త్వరలోనే ఇతర తారాగణం వంటి వివరాలను చిత్రబృందం ప్రకటించనుంది. శివాజీ-లయ జోడీ మరోసారి కలిసి నటించడంతో వారి అభిమానులు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కూడా అంచనాలను అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.