AP PCC Chief Sharmila: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడుగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల తన కర్తవ్యాలను నిర్వహించనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించడంపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
ALSO READ: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500!
రాష్ట్రంలో లేని పార్టీ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? అని మంత్రి గుడివాడ అమర్నాథ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువ వచ్చిందని పేర్కొన్నారు. అటువంటి లేని పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరం అని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అన్నదమ్ములు చాలా మందికి ఉంటారు. ఉన్నోరంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా? అని అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరని ఎద్దేవా చేశారు. దానికి ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయం కారణం.. మనం కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని ప్రజలు అనుకున్నారని… అలానే లేకుండా చేశారని పేర్కొన్నారు.షాట్, షర్మిల కాంగ్రెస్ లో చేరడం వచ్చే ఎన్నికల్లో ఎలాటి ప్రభావం చూపదని అన్నారు.
ALSO READ: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
కీ౹౹శే.. లే!…
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు చేశారు. ‘Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!’ అంటూ రాసుకొచ్చారు. వైఎస్సార్ మరణంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నుంచి కనుమరుగైందని అర్థం వచ్చేల అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2024
DO WATCH: