Mouni Roy: బాలీవుడ్ నటి, ‘నాగిని’ (Naagin) ఫేమ్ మౌనీరాయ్ (Mouni Roy) కెరీర్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై ఓపెన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యేలో పాల్గొన్న ఆమె 17 ఏళ్ల వయసులోనే ఊహించని సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పింది. అలాగే తన అందం, ఆకర్షణ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Obsessing over the style and glam here! 🤍🧿#LoveYa song now out on Saregama Music YouTube Channel and major music streaming platforms@diljitdosanjh @yourjaani @Roymouni @TheTusharKalia @snehasshetty #Sagar #Hunny #Bunny#Saregama #SaregamaMusic #DiljitDosanjh #MouniRoy… pic.twitter.com/0GlTrPzqbq
— Saregama (@saregamaglobal) January 12, 2024
అదే నిజం..
ఈ మేరకు మౌని రాయ్ మాట్లాడుతూ.. ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉండనని నన్ను నేను విమర్శించుకుంటాను. అదే నిజమని పప్పుడో ఫిక్స్ అయ్యాను. ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పటినుంచి చాలా ఒత్తిడి ఆలోచనల నుంచి బయటపడ్డా. నన్ను నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నన్ను నేను అంగీకరించడంలో ధ్యానం సహాయపడింది. ఈ విషయం నా స్నేహితులకు బాగా తెలుసు’ అని వివరించింది.
ఇది కూడా చదవండి : Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఎఫ్ఐఆర్ నమోదు
ఎన్నో సవాళ్లు..
అలాగే 17 ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాని చెప్పంది. ‘ ఈ స్థాయిలో నిలిచేందుకు నాకు ఉపయోగపడిన టెలివిజన్‌కు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సినిమాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాననే భావనతో ‘గోల్డ్’(Gold) మూవీలో నటించాను. అందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అందుకు నేను సరిపోతాను అనిపించి ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ తర్వాత బాగానే మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. టెస్ట్ చేసి షార్ట్‌లిస్ట్ చేసిన వాళ్లలో రెండో స్థానంలో నిలిచిన సందర్భాలున్నాయి. కానీ అవకాశాలు వచ్చేవి కావు. వాటికి సరైన కారణాలు ఉండేవి కావు. సినీ పరిశ్రమ ఇలానే ఉంటుందని అప్పుడు అర్థమైంది. ఏది జరిగినా, చేదు అనుభవాలు ఎదురైనా ముందుకే సాగాలి. ఇప్పుడు నేను చేయాలి అనుకున్నది చేయగలుగుతున్నాను అది నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది మౌనీ.