India Vs South Africa: క్రికెట్ అంటేనే ఫైటింగ్ గేమ్. మైదానం బయట ఎలా ఉన్నా.. గ్రౌండ్లో మాత్రం క్రికెటర్లు ఫైటర్లుగా మారిపోతుంటారు. చాలా మొండిగా ఆడుతుంటారు. దెబ్బలు తగులుతున్నా.. నొప్పి తీవ్రత అధికమవుతున్నా తమ జట్టు కోసం ప్రాణం పెట్టేస్తారు. ముఖ్యంగా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంటే తగిలిన గాయాలను లెక్క చేయరు. కుంబ్లే, యువరాజ్, ధోనీ, సచిన్ గతంలో ఎన్నోసార్లు గాయాలతోనే బరిలోకి దిగి ఔరా అనిపించారు. వేలు విరిగినా చివరి బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన నాటి దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మీత్ గురించి క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరిచిపోరు. ఇక తాజాగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) చూపిన తెగువకు క్రికెట్ ప్రపంచం సలామ్ చేస్తోంది.
Shardul Thakur is a fighter. 🫡 pic.twitter.com/Wg6im2b9WD
— Johns. (@CricCrazyJohns) December 26, 2023
చాలా గట్టిగా తగిలింది.. అయినా:
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ హెల్మెట్‌కు గాయమైంది. పదునైన బౌన్సర్ దెబ్బకు అతను గాయపడ్డాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ 44వ ఓవర్లో దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోట్జీ(Gerald Coetzee) వేసిన వేగవంతమైన బౌన్సర్ శార్దూల్‌కి చాలా బలంగా తాకింది. శార్దూల్ వెంటనే ఫిజియోకు సైగ చేశాడు. భారత జట్టు వైద్యులు పిచ్‌పైకి పరుగులు తీశారు. హెల్మెట్‌పై బంతి ప్రభావం ఎక్కువగా ఉండటంతో శార్దూల్ నుదుటిపై వాపు వచ్చినట్లు టెలివిజన్ విజువల్స్‌లో క్లియర్‌గా చూపించారు.
Shardul Thakur got hit hard on the helmet by Gerald Coetzee’s delivery! 😳
📷: Hotstar#ShardulThakur #SAvIND #Cricket #Sportskeeda pic.twitter.com/BcYuTx6RVX
— Sportskeeda (@Sportskeeda) December 26, 2023
వాపుపై ఐస్ ప్యాక్ కూడా వేయించుకున్న ఠాకూర్ గ్రౌండ్‌ను వీడుతాడని అంతా భావించారు. అయితే ఠాకూర్ మాత్రం బ్యాటింగ్ కొనసాగించాడు. దీంఓత సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. శార్దూల్ ఠాకూర్ మళ్లీ హెల్మెట్ పట్టీలు ధరించి బ్యాటింగ్ కొనసాగించడంతో రాహుల్, ఠాకూర్ భాగస్వామ్యం కొనసాగింది. అప్పటికీ ఆరు వికెట్లు పడిపోవడంతో రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కపెట్టే బాధ్యత తీసుకున్న ఠాకూర్ పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో ఏడో వికెట్‌గా వెనుతిరిగాడు. రబాడా వేసిన ఆ ఓవర్లో షార్ట్ మిడాఫ్‌లో ఎల్గర్‌కు దొరికిపోయాడు. ఈ వికెట్‌తో రబాడా(Rabada) ఖాతాలో 5వికెట్లు పడ్డాయి.
Also Read: దక్షిణాఫ్రికా గడ్డపై ‘నో హిట్ శర్మ..’ సఫారీ పిచ్‌లపై ఘోరంగా రోహిత్ లెక్కలు!
WATCH: