Senior Actor Jagapathi Babu Celebrates Kalki Success : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ దక్కడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఇక సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు మూవీ టీమ్ సైతం ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే కల్కి సక్సెస్ ను సీనియర్ హీరో జగపతి బాబు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అది కూడా ఫారిన్ లో కావడం విశేషం. జగ్గూభాయ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో మందు బాటిల్ కలుపుతూ కనిపించారు. ప్రభాస్, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Darling Prabhasa ki, Kalki team ki Cheers. 🥂 #Kalki2898AD #Prabhas pic.twitter.com/qFoJhAcQ4b
— Jaggu Bhai (@IamJagguBhai) July 21, 2024
Also Read : మరో హీరోయిన్ కాపురంలో వేణుస్వామి చిచ్చు.. విడాకులు తప్పవంటూ జ్యోతిష్యం!
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కాగా ప్రభాస్, జగపతి బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. గత ఏడాది వచ్చిన ‘సలార్’ మూవీలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. అందులో జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.