Chennai : పబ్(Pub) లో ఘోర ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. అనుకోని సంఘటనతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందడం స్థానికులను కలిచివేసింది. అప్పటిదాకా ఆడిపాడుతూ ఎంజాయ్ చేసిన యువకులు ఒక్కసారిగా విగతజీవులుగా పడివుండటం చూసి తోటి యువకులు ఉలిక్కిపడ్డారు.
#WATCH | Tamil Nadu: One person dies after the false ceiling inside Sekhmet club in Chennai collapses. Rescue operation underway. Further details awaited: Prem Anand Sinha, Additional Commissioner of Police, Chennai pic.twitter.com/lJsF8Lrcgg
— ANI (@ANI) March 28, 2024
Also Read : ఘోర ప్రమాదం.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
ఆల్వార్ పేట్ లోని పబ్..
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలోని ఆల్వార్పేట సెఖ్మెట్ క్లబ్(Sekhmet Club) లో ఫాల్స్ సీలింగ్ కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సివుంది.