Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో మొదటి రెండు టెస్టులకు దూరమవడానికి కారణం ఎట్టకేలకు తెలిసిపోయింది. ఇటీవల తన తల్లికి అనారోగ్యం అంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా దీనిపై విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. దీంతో జనాలు మరోసారి రీజన్ ఏమిటనే చర్చ మొదలుపెట్టగా తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) గుడ్ న్యూస్ చెప్పాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు.
AB De Villiers said, “Virat Kohli and Anushka Sharma are expecting their 2nd child, so Virat is spending time with his family”. (AB YT). pic.twitter.com/qurRKnFK1q
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 3, 2024
కోహ్లీ రెండో బిడ్డ రాబోతుంది..
ఈ మేరకు తాజాగా యూట్యూబ్ లైవ్లో ఏబీ డివిలియర్స్ అభిమానులతో ముచ్చటిస్తూ.. కోహ్లీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరంగా ఉన్నాడని చెప్పాడు. ‘విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడగగా.. ‘ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం. విరాట్ తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావిస్తుండొచ్చు. కానీ, అది తప్పు. కోహ్లీని మేం కూడా మిస్ అవుతున్నాం. అతడు కచ్చితంగా సరైన నిర్ణయమే తీసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు డివిలియర్స్.
ఇది కూడా చదవండి : Yashasvi Jaiswal: 16ఏళ్ల నిరీక్షణకు తెర.. యశస్వీ డబుల్ సెంచరీతో బద్దలైన ఏళ్లనాటి రికార్డులు!
ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..
2017లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2021లో వీరికి వామిక జన్మించింది. ఇక ఇంగ్లాండ్తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆ మ్యాచ్లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నందకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.