Uppal Stadium: IPL అంటే క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూసేందుకు వేలు ఖర్చుపెట్టి మరీ టికెట్లు కొనుక్కుంటారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేకుండా స్టేడియానికి చేరుకుంటారు. ఇటీవల ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మ్యాచ్‌లో ఓ అభిమానికి నిరాశ ఎదురైంది. రూ.4500 పెట్టి టికెట్ కొని స్టేడియానికి వెళ్లే సరికి అక్కడ సీటు లేకుండా పోయింది. ఓ క్రికెట్ అభిమాని రూ.4500 పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. అతనికి జే 66 నెంబర్ సీటును కేటాయించారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే జే67, జే65 సీటు మధ్యలో 66 నెంబర్ సీటు లేదు. ఒక్కసారిగా అతను కంగుతిన్నాడు.
Disappointed that I’ve booked a ticket and seat Number was J66 in Stand.
Sorry state that seat doesn’t exist and had to stand and enjoy the game. Do I get a refund and compensation for this.#SRHvCSK #IPL2024 @JayShah @BCCI @IPL @JaganMohanRaoA @SunRisers pic.twitter.com/0fwFnjk641
— Junaid Ahmed (@junaid_csk_7) April 5, 2024
చేసేదేమీ లేక మ్యాచ్ మొత్తం నిలబడి చూడాల్సి వచ్చింది. చెన్నై సూపర్‌కింగ్స్ సపోర్టర్ జునైద్ అహ్మద్ తన టికెట్‌తో పాటు వీడియోలను ట్విట్టర్లో షేర్ చేశాడు. స్టేడియం నిర్వాహకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు అతని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇంత అన్యాయం మరొకటి ఉండదంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. హెచ్‌సీఏ తీరుపై మండిపడుతున్నారు. అయితే మ్యాచ్ అయిపోయే సరికి అతని సీటు J69-70 మధ్య కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. అంతా అయిపోయిన తర్వాత సీటు ఎక్కడో కనిపించేసరికి ఏం చేసుకోవాలంటూ అసహనానికి గురయ్యాడు.
ఇది కూడా చదవండి: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కడుపులో గడ్డలు ఉన్నట్టే..జాగ్రత్త
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.