కొద్దికాలం సినిమాలకు, షోలకు బ్రేక్ ఇచ్చిన మెగా డాటర్ నీహారికా మళ్ళీ తన కెరీర్ మీద కాన్సంట్రేషన్ పెట్టింది. ఫుల్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్లో మంచు మనోజ్ హీరోగా చేస్తున్న వాట్ ద ఫిష్‌లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న నీహారికా తమిళంలో కూడా సినిమాలకు సైనప్ చేస్తోంది. ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేసిన నిహారిక.. ఇటీవల మద్రాస్ కారన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. ఈ మూవీలో మలయాళం హీరో ఆర్డీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ కు జోడీగా నటిస్తోంది.
సినిమాలే కాదు షోలు కూడా…
నిహారికా ఒక్క సినిమాలకే పరిమితం అయిపోవడం లేదు. వెబ్ సీరీస్లు కూడా చేస్తోంది. దాంతో పాటూ ఇప్పుడు కొత్త షోస్ చేయడానికి కూడా రెడీ అవుతోంది. తాజాగా ఆహాలో క్ష షో కు సైనప్ చేసింది మెగా డాటర్. అంతకు ముందు మంచు లక్ష్మి చేసిన చెఫ్ మంత్ర సీజన్-౩ కు నీహారికా యాంకర్‌గా వ్యవహరించనుంది. ఓటీటీలో ఈ షోతో ఆమె గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 3వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సెలబ్రిటీలు, సినిమా నటులతో వండించడమే కాకుండా వారితో ఫన్నీ చిట్ చాట్ కూడా ఉంటుంది. మామూలుగానే సరదాగా, ఫన్నీగా ఉండే నీహారికా ఇలాంటి ప్రోగ్రామ్‌లను సక్సెస్ ఫుల్‌గా నడించగలదని ఆహా యాజమాన్యం అంటున్నారు.
ప్రకటించిన ఆహా..
నీహారికా షో విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఫన్నీ పోస్టర్ షేర్ చేసింది. ఈ షో ఎపిసోడ్స్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు చెఫ్ మంత్ర సీజన్-౩ కోసం ఇండస్ట్రీలోని క్రేజీ స్టార్లను తీసుకురాబోతున్నారుట కూడా. మొత్తం 8 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు.