Delhi Pollution: దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి కాలుష్యం పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ కాలుష్యం వలన ఢిల్లీలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వాలు మారిన కాలుష్యం నియంత్రించడంలో మాత్రం అన్నీ విఫలమైయ్యాయి. ఎన్ని చర్యలు చేపట్టిన గాలి నాణ్యత మాత్రం పెరగడం లేదు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత మరింత పడిపోవడంతో అక్కడి ఆప్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 13 నుండి నవంబర్ 20 వరకు ఒక వారం పాటు సరి-బేసి వాహన రేషన్ విధానాన్ని పునఃప్రారంభించనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు.
ALSO READ: బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది: కేటీఆర్
సరి-బేసి పథకం అంటే:
సరి-బేసి పథకం ప్రకారం, సరి సంఖ్యతో (0, 2, 4, 6, 8) ముగిసే లైసెన్స్ ప్లేట్ నంబర్లు కలిగిన వాహనాలు సరి తేదీలలో (అంటే 2,4,6,8… తేదీల్లో) అక్కడి రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అలాగే, బేసి అంకెలతో (1, 3, 5, 7) ముగిసే వాహనాలు బేసి తేదీలలో నగరంలో తిరిగేందుకు అనుమతి ఉంటుంది.
స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు పెంపు:
పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ సర్కార్ ఇటీవలే విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కాలుష్యం తార స్థాయికి చేరడంతో అక్కడి ప్రభుత్వం స్కూళ్లకు, కాలేజీలకు సెలవులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆతిషి ప్రకటించారు. ప్రైమరీ విద్యాసంస్థలకు పూర్తిగా సెలవు ఉంటుందని, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు చెప్పాలని పేర్కొన్నారు. అలాగే.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. నవంబర్ 10వరకు 50 శాతం మందితో కార్యాలయాలను నడపాలని.. మిగితా వారికి వర్క్ ఫ్రామ్ హోమ్ ఇవ్వాలని తెలిపారు. కాలుష్య స్థాయి భట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ALSO READ: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళి సెలవుల్లో మార్పులు.. మొత్తం 3 రోజులు!