Shoebill Stork – Scariest Bird on Planet: ప్రపంచంలోనే అత్యంత భయానక పక్షిగా ‘షూబిల్ కొంగ’ (Shoebill Stork) గుర్తింపు పొందింది. ఇది ప్రధానంగా తూర్పు ఆఫ్రికా, ఇథియోపియా, దక్షిణ సూడాన్, జాంబియాలో కనిపిస్తుంది. నిజానికి ఇది కొంగ కుటుంబానికి చెందినది కానప్పటికీ చాలా మంది షూబిల్ను కొంగగా భావిస్తారు. కానీ ఇవి పెలి సన్నిహిత కుటుంబానికి చెందినవిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ముక్కు అంచులు చాలా పదునైనవి..
షూబిల్ అనే పేరుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. దాని ముక్కు ఒక అడుగు పొడవు ఉంటుంది. సుమారు 5 అంగుళాల వెడల్పు ఉండే ముక్కు అంచులు చాలా పదునైనవి. దీనికి చివరలో పదునైన హుక్ కూడా ఉంటుంది. దీని సహాయంతో చేపలు, పాములు వంటి వాటిని వేటాడతాయి. ఇవి మొసలి పిల్లలను కూడా తింటాయి. పెద్ద పెద్ద బల్లులను భక్షిస్తాయి.ఈ షూబిల్స్ నీటిలో లేదా చిత్తడి ప్రదేశంలో కదలకుండా చాలా గంటలు ఒకే చోట నిలబడగలవు. ఇది వాటికి వేటలో సహాయపడుతుంది. చేపలు లేదా ఈల్స్ వంటి జంతువులు ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలంపైకి వచ్చిన వెంటనే షూబిల్ వాటిని వేటాడుతుంది. ఇక షూబిల్లు 4 నుండి 5 అడుగుల పొడవు ఉంటుంది. వాటి రెక్కలు నీలం-గోధుమ రంగులో ఉంటాయి. వాటి రెక్కలు 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంటాయి. మగ షూబిల్ బరువు 12 పౌండ్ల (సుమారు 5.5 కిలోలు). ఆడ షూబిల్ 11 పౌండ్ల (4.9 కిలోలు) మధ్య ఉంటుంది. షూబిల్స్ 35 నుండి 50 సంవత్సరాల వరకు జీవించగలవు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, షూబిల్లులు ప్రధానంగా మాంసాహారులు.
ఇది కూడా చదవండి: Metro: మెట్రో స్టేషన్ లో బహిరంగ హస్తప్రయోగం.. సిబ్బందిపై మహిళల ఫిర్యాదు!
‘స్టుపిడ్ బర్డ్’ అని కూడా పిలుస్తారు..
దీనిని ‘స్టుపిడ్ బర్డ్’ అని కూడా పిలుస్తారు. షూబిల్ నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఏదైనా ఆహారాన్ని వాటి ముందు పెడితే తినాలా వద్దా అని గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటాయట. మరొక అలవాటు ఈ పక్షిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఒక మనిషి తమ వైపుకు రావడం చూసి తమ రెక్కలను ముడుచుకుంటాయట.
షూబిల్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,300 నుంచి 5,300 మాత్రమే మిగిలి ఉన్నాయట. వాటి జనాభా వేగంగా తగ్గుతోందని వీటిని రెడ్ లిస్టులో చేర్చారు. అరబ్ దేశాలలో వీటి ఈకలను షూ లేస్లకు వాడుకుంటారు. ఒక షూబిల్ బ్లాక్ మార్కెట్లో 10000 డాలర్లు (8-10 లక్షల రూపాయలు) వరకు విక్రయించబడుతుంది.