Satya Kumar Yadav: ఈరోజు ఏపీ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రిగా (Health Minister) సత్యకుమార్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తనను గుర్తించి పదవి అప్పగించిన మోదీ (PM Modi), చంద్రబాబుకు (CM Chandrababu Naidu) ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతానని అన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఆప్రికారాలు అందుబాటులో ఉండేలా చూస్తానని పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తాం అని అన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు.
Also Read: జగన్ మనుషులనే కాదు మిషన్లను కూడా నమ్మడు.. ఏపీ సచివాలయంలో కొత్త చర్చ!