Chamundeswaranath: నిత్యం క్రీడలను ప్రోత్సహించే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ మంకిన చాముండేశ్వరనాథ్.. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఆల్ ఇండియా మెన్స్ అండ్ ఉమెన్స్ టోర్నమెంట్ ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాముండేశ్వరనాథ్, సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఇతర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే BMW కారు..
ఈ సందర్భంగా మాట్లాడిన చాముండేశ్వరనాథ్.. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు క్రీడాకారులకు ఎంతో ఉత్సాహానిస్తాయని చెప్పారు. ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ రాజ్ (Satwiksai Raj).. ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే BMW కారు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక దేశంలో కొవిడ్ తరువాత 10 లక్షల బహుమతితో ఇప్పటి వరకు ఒక్క టోర్నమెంట్ జరగలేదని ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు జి.ఆదిశేషగిరిరావు అన్నారు.
ఇది కూడా చదవండి: BadShah: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్!
సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా..
ఇక ఎఫ్ఎన్సీసీ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి అభయ వేమూరి రన్నరప్‌గా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో అభయ 4-6, 3-6 తేడాతో ఆరో సీడ్ మహారాష్ట్ర క్రీడాకారిణి ఆకాంక్ష చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో ఆకాంక్ష – పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణి యుబ్రాని జంట 4-6, 6-4, 10-4తో బిహార్‌కు చెందిన మేధాని – ఆయూషీ జోడీపై నెగ్గింది. డబుల్స్‌లో ఆకాంక్ష-యుబ్రాని జంట 4-6, 6-4, 10-4తో గెలుపొందింది. ఇక గతంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించిన చాముండేశ్వరనాథ్.. పీవీ సింధు, సాక్షి మాలిక్, మిథాలి రాజ్, నికత్ జరీన్, సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, పుల్లెల గోపీచంద్, సానియా మీర్జా, అరుణా రెడ్డి (జిమ్నాస్టిక్స్) తదితర క్రీడాకారులకు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు.