Sania Mirza – Shoaib Malik Divorce: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik), టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) దంపతుల విడాకుల ఇష్యూపై సానియా తండ్రి స్పందించారు. ఈ మేరకు నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నట్లు చెబుతూ షోయబ్ మాలిక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై తాజాగా రియాక్ట్ అయిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా (Imran mirza).. ముస్లిం మతంలో భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కు ఉంటుందని చెప్పారు.
– Alhamdullilah ♥️
“And We created you in pairs” وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
‘ఖులా’ ఏకపక్ష విడాకులు..
ఈ మేరకు సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా మాట్లాడుతూ.. ‘సానియా మీర్జా ‘ఖులా’ను ఎంచుకుంది. ఇది ఒక ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును సూచిస్తుంది. నా కూతురు ప్రస్తుతం ఏకపక్షంగా విడాకులు తీసుకుంది’ అన్నారు. అయితే విడాకులకు మాలిక్ అంగీకరించారా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. కాగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఇది కూడా చదవండి : Ram Mandir: ఏడంచెల భద్రతా వలయం.. అయోధ్య భద్రత కోసం ఫ్లోటింగ్ స్క్వాడ్లు, డ్రోన్లు, ఏఐ..!
మూడేళ్లు కాపురం చేసి..
ఇక షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే సానియా విడిపోవాలనుకుంటుందని, విడాకులు తీసుకునేందుకు సిద్ధమైదంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీటిపై సానియా, మాలిక్ లు స్పందించకపోగా.. సనాను తాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ మాలిక్ శనివారం ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. షోయబ్ మాలిక్, సనా జావేద్ లు ఇద్దరూ తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక పాకిస్థాన్ టెలివిజన్‌లో కనిపించే సనా జావేద్.. ప్రముఖ గాయకుడు ఉమైర్ జస్వాల్‌తో మూడేళ్లు కాపురం చేసి 2023లో విడాకులు తీసుకుంది.
ఇదిలావుంటే.. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా.. షోయబ్ మాలిక్ ఆమె కెరీర్ విజయాలను ప్రశంసిస్తూ హృదయపూర్వక గమనికను రాశాడు. ఇద్దరు స్పోర్ట్స్ స్టార్స్ గత సంవత్సరం UAE లో ఒక టాక్ షోను కూడా నిర్వహించారు.