Sangeeta Phogat: భారత యంగ్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)కు సంబంధించిన మరో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరించే చాహల్.. టీమ్ సభ్యులతోనూ చాలా అల్లరి చేస్తుంటాడనే సంగతి తెలిసిందే. అంతేకాదు ఫీల్డ్ లోనూ వికెట్ పడ్డప్పుడు చేసుకునే సంబరాలు సైతం నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే తన కోతి చేష్టలతో అందరినీ ఆటపట్టించే చాహల్ కు ఓ యువతి ఊహించని షాక్ ఇచ్చింది. చిన్న పిల్లాడిలా భుజాలమీద ఎత్తుకుని గిరా గిరా తిప్పేసింది.
View this post on Instagram
భుజాలపై ఎత్తుకుని..
ఈ మేరకు భారత రెజ్లర్ సంగీత ఫొగాట్ (Sangeeta Phogat) టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)కు మధ్య ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. వీరిద్దరు ఇటీవల ‘ఝలక్ దిఖ్లా జా ర్యాప్ అప్’ పార్టీలో కలుసుకున్నారు. అయితే ఆ సమయంలో చాహల్తో సరదాగా గడిపిన సంగీత.. ఓ టాస్క్ లో భాగంగా చాహల్ ను భుజాలపై ఎత్తుకుని గిరగిరా తిప్పేసింది.
ఇది కూడా చదవండి : Madhavi Latha: ఆ కారణంతోనే మాధవీలతకు ఎంపీ టికెట్?
దీంతో ‘నాకు తల తిరుగుతోంది. నన్ను కిందకు దించేయ్’ అంటూ చాహల్ బతిమిలాడటం అక్కడున్నవారందరితోపాటు నెటిజన్లకు సైతం నవ్వులు పూయించింది. ఇక ఈ సరదా వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.