Chalo Delhi : పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతు సంఘాలు ‘ఛలో ఢిల్లీ'(Chalo Delhi) కి పిలుపునిచ్చాయి. దీనిని చట్టబద్ధం చేయడంతోపాటు పలు డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా(Kisan Morcha) ఆధ్వర్యంలో కొన్ని సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈ నెల 13న పెద్దఎత్తున దేశ రాజధాని(Capital) కి రైతులు తరలి రావాలని కోరారు.
Farmer Protest! Police preparation start to Stop Farmers!pic.twitter.com/ILqQAMLDGA
— Ashish Singh (@AshishSinghKiJi) February 11, 2024
మరోసారి టెన్షన్ వాతావరణం..
పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతులు మరోసారి ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. ఈ నెల 13న పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది. దీంతో పంజాబ్, హర్యానాలో మరోసారి టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సరిహద్దు జిల్లాల బార్డర్లను ప్రభుత్వం మూసివేసింది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Crime : భార్య వివాహేతర సంబంధం.. అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త
ఇంటర్నెట్ సేవలు బంద్..
ఈ క్రమంలో అప్రమత్తమైన హర్యానా(Haryana) గవర్నమెంట్ రాష్ట్రంవ్యాప్తంగా 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్(Mobile Internet) చేసింది. అలాగే బల్క్ ఎస్ఎంఎస్(Bulk SMS) లపై కూడా ఆంక్షలు విధించింది. అలాగే అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిసార్, ఫతేబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11నుంచి 13న రాత్రి 11.59 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.
Farmers are barred from entering the national capital, Delhi, prompting heavy barricades on the roads leading to Delhi.
• Can’t the farmers of the country come to the capital?
• Can’t farmers protest peacefully in India, a democratic country?#FarmersProtest pic.twitter.com/yCHsvRnvCI— Tractor2ਟਵਿੱਟਰ ਪੰਜਾਬ (@Tractor2twitr_P) February 10, 2024
Also Read : Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఎఫ్ఐఆర్ నమోదు