Hyderabad Salon Incident: కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడునగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ (Ashok) ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సెలూన్‌లోని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి దుండగులు పరారయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అశోక్ సెల్ ఫోన్‌కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే.. అతను లిఫ్ట్ చేయకపోవడంతో సెలూన్ దగ్గరికి అతని భార్య, కుమారులు వెళ్లారు. సెలూన్ షట్టర్పైకి లేపి చేడగానే అశోక్ విగతజీవిగా పడి ఉన్నాడు. అది చూసి షాక్‌కు గురైన అతడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్లూస్ టీమ్, కూకట్పల్లి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి పీఎస్ పరిధిలోని పాపారాయుడు నగర్లో అశోక్ నివాసం ఉంటున్నాడు. హర్ష లుక్స్ (Harsha Looks) పేరుతో సెలూన్ నిర్వహిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే (ఆదివారం) నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు సెలూన్ లోపలి వచ్చి అశోక్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం.. సెలూన్‌లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. గతంలో మృతుడు అశోక్ దగ్గర పని చేసిన యువకుడే ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు… అతడి వివరాలు, పాత్రపై ఆరా తీస్తున్నారు. సెలూన్ యజమాని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇది కూడా చదవండి: తుమ్మలతో అనుబంధం తెంచుకోలేను.. మళ్లీ గెలుస్తా: మెచ్చా నాగేశ్వరరావు ఇంటర్వ్యూ
అశోక్ మృతితో హైదరాబాద్ కూకట్‌పల్లిలో టెన్షన్..టెన్షన్‌గా ఉంది. సెలూన్ ఓనర్ హత్యకు నిరసనగా పెద్ద సంఖ్యలో రోడ్డెక్కిన ఆందోళనలు చేస్తున్నారు. అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అశోక్‌ను చంపింది బీహారీ గ్యాంగేనంటూ నాయీ బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కత్తెరతో మెడ కోసి చంపారని పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. పని కల్పించి ఆశ్రయిమిచ్చిన అశోక్‌ను అత్యంత కిరాతకంగా చంపారని ఆందోళనలు చేశారు. బీహారీలను పనిలో పెట్టుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.