Salman Khan residence firing case: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటివద్ద ఇటీవల ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా ఈ కాల్పుల కేసులో అరెస్ట్ అయిన నిందితుడు అనుజ్ థాపన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే బుధవారం అనుజ్ జైలులోనే సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం గమనించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించినట్లు వైద్యులు, ముంబై పోలీసులు వెల్లడించారు.
Salman Khan residence firing case | Accused Anuj Thapan who attempted suicide in custody has been declared dead by doctors at the hospital: Mumbai Police https://t.co/3OMrikn0nP
— ANI (@ANI) May 1, 2024
అసలేం జరిగిందంటే..
ఏప్రిల్ 14 తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులకు పాల్పడ్డారు. సల్మాన్ నివసిస్తున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ బయట బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఖాన్ కుటుంబం నివసించే గెలాక్సీ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయింది. షూటర్లు విక్కీ గుప్తా , సాగర్ పాల్ తో పాటు వీరికి ఆయుధాలిచ్చారనే ఆరోపణలతో అనుజ్ థాపన్ లను పోలీసులు ఏప్రిల్ 16న అదుపులోకి తీసుకున్నారు.నిందితులందరిపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ఆఫ్ ఆర్గనైజ్ డ్ యాక్ట్( MCOCA) సెక్షన్లను ప్రయోగించారు. అనంతరం అనుజ్ థాపన్ తోపాటు మరొకరిని జైలుకు తరలించారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుండి బెదిరింపుల తర్వాత 2022లో సల్మాన్ భద్రతా స్థాయిని వై-ప్లస్‌కి పెంచారు.